ADDITIONAL EO REVIEWS ON TUMBURU THEERTHA MUKKOTI _ ఏప్రిల్ 11, 12 తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
Text content
TIRUMALA, 10 APRIL 2025: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary on Thursday reviewed in detail the arrangements to be made for the devotees trekking Tumburu Theertham on April 11 and 12.
The review meeting took place at Annamaiah Bhavan in Tirumala on Thursday afternoon with various departments in Tirumala.
The Additional EO said the devotees need to be sensitized properly on do’s and dont’s before allowed for trekking.
In view of the safety of the devotees, APSRTC will run buses carrying pilgrims from Octopus junction to Papavinasanam point.
Devotees who have chronic heart and other diseases, obesity, asthma, below 10years will not be allowed for trekking.
The path will be open for trekking on April 11 and 12 from 5am to 10 am only on both days.
Annaprasadam, water and buttermilk distribution, security and medical arrangements have been made for the safety of sevaks and over 300 Srivari Sevaks have been deployed for this task.
The Additional EO instructed TTD forest and vigilance sleuths to be vigilant and also keep a watch on fire safety measures while the devotees are trekking Tumburu Theertham.
All the department officials in Tirumala were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 11, 12 తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
• ఉదయం 5 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి
• తుంబురు తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
తిరుమల, 2025 ఏప్రిల్ 10: తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఉదయం 05 నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.
తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.
తీర్థానికి వెళ్లే మార్గంలో సూచి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.