ADDNL. EO REVIEWS ENGINEERING WORKS _ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష 

TIRUMALA, 02 JUNE 2026: The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary on Tuesday reviewed the ongoing works by the Engineering department.

The meeting was held at Sudharma Hall in SPRH. As a part of it he reviewed the progress of works pertaining to civil, electrical, water works and also reviewed the designs for Kalyani Choultries and CRO. 

Later, he also reviewed  on the progress of development works related to SV Museum.

Chief Engineer Sri Satyanarayana, SE Sri Venugopal, EEs Sri Srinivasa Rao, Sri Sudhakar, DE Electrical Sri Chandrasekhar, Dy EO Health and Chief Museum Officer Sri Soman Narayana, DyEO Sri Bhaskar, GM IT Sri Venkateswarulu Naidu, VGO Sri Surendra and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఇంజనీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష 

తిరుమల, 02 జూన్ 2026: టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు.

ఈ సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో  జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ మరియు సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు.

తరువాత, ఎస్వీ మ్యూజియంకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత సమయం లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ సుధాకర్, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, డిప్యూటీ ఈఓ హెల్త్ మరియు చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్ నారాయణ, డిప్యూటీ ఈఓ రిసెప్షన్ శ్రీ భాస్కర్, జీఎం ఐటీ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, వీజీఓ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది