ADHYAYANOTSAVAMS COMMENCE AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
Tirupati, 18 January 2026: The annual Adhyayanotsavams commenced on Sunday at the Sri Govindaraja Swamy Temple in Tirupati. The festival will be observed till February 10.
As per tradition, Divya Prabandham is recited every year during the Adhyayanotsavams at the temple. As part of the celebrations, the daily sevakalam was conducted in the morning.
In the evening, from 6.30 p.m. to 8.00 p.m., Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi, Senaadhipathi and the Alwars are being taken in procession to the Kalyana Mandapam in the temple premises. In their presence, Divya Prabandham is being recited.
TTD Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Superintendent Sri Chiranjeevi and archakas participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2026 జనవరి 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగనున్నాయి.
ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు.


