ADI KRITTIKA ON AUGUST 9 IN KT _ ఆగస్టు 9న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక
TIRUPATI, 02 AUGUST 2023: The celestial event of Adi Krittika will be observed in Sri Kapileswara Swamy temple on August 09 in Tirupati.
In the morning there will be Snapana Tirumanjanam to Sri Valli Devasena sameta Sri Subrahmanya Swamy utsava murthies in the morning. While in the evening Tiruveedhi Utsavam will be observed.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 9న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక
తిరుపతి, 2023 ఆగస్టు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీన బుధవారం ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం అభిషేకం చేపడతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.