“ADIVO ALLADIVO” TO BE AIRED FOR 52 WEEKS-TTD EO _ శ్రీవారి భక్తాగ్రగణ్యుల జీవిత చరిత్రలను భక్తలోకానికి అందించాలి
SVBC TO TELECAST SPECIAL PROGRAMMES ON ARDENT DEVOTEES OF SRIVARU
Tirupati, 26 March 2022: After receiving the overwhelming response to the “Adivo Alladivo” program across the world, TTD has decided to telecast the program for 52 weeks instead of 26 weeks in SVBC as was planned earlier, said TTD EO Dr KS Jawahar Reddy.
A review meeting on SVBC programs was held in Sri Padmavathi Rest House in Tirupati on Saturday. The EO said apart from popularizing the Sankeertans penned by Saint Poet Sri Tallapaka Annamacharya, a new program popularising the life of other ardent devotees of Sri Venkateswara Swamy viz. Sri Nadamuni, Anantalwar, Pallava Samavai, Tarigonda Vengamamba will also be telecasted on SVBC, he maintained.
He said in SVBC Kannada Channel, a new program, “Dasa Namana” will be telecasted soon popularising the Dasa Sahitya Sankeertans penned by great Kannada saint poets, he added.
SVBC Chairman Dr Saikrishna Yachendra, CEO Sri Suresh Kumar and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి భక్తాగ్రగణ్యుల జీవిత చరిత్రలను భక్తలోకానికి అందించాలి
ఎస్వీబిసిలో సరి క్రొత్త శీర్షికలను రూపొందించి ప్రసారం చేయాలి : టిటిడి ఈవో
తిరుపతి, 2022 మార్చి 26: శ్రీవారి భక్తాగ్రగణ్యులైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ నాథముని ఆచార్యులు, శ్రీ అనంతాచార్యులు, పల్లవ రాణి సామవై తదితరుల జీవిత చరిత్రలను భక్తలోకానికి అందించేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సరి క్రొత్త శీర్షికలు రూపొందించి ప్రసారం చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సమావేశ మందిరంలో ఈవో ఎస్వీబిసి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు రచించిన వేలాది సంకీర్తనలల్లో ప్రాచుర్యంలో లేని సంకీర్తనలకు జనబాహుళ్యంలో విస్తృతప్రచారం కల్పించాలనే సత్సంకల్పంతో యువతీ యువకులకు ఎస్వీబిసిలో అదివో… అల్లదివో… అన్నమయ్య పాటల పోటీలు గత ఏడాది డిసెంబరులో ప్రారంభించినట్లు తెలిపారు. మొదట ఈ కార్యక్రమాన్ని 26 ఎపిసోడ్లు చేయాలని నిర్ణయించామని, కానీ భక్తుల నుండి లభిస్తున్న విశేష ఆదరణ దృష్ట్యా ఒక సంవత్సరం 53 వారాల పాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తరిగొండ వెంగమాంబ పాటలకు మరింత విస్తృత ప్రాచుర్యం కల్పించ నున్నట్లు తెలిపారు.
అదేవిధంగా 1200 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయానికి భోగ శ్రీనివాస మూర్తిని బహూకరించిన పల్లవ రాణి సామవై, శ్రీ వైష్ణవ ఆచార్యుల్లో అగ్రగణ్యుడు నారాయణ దివ్య ప్రబంధంను రచించిన శ్రీ నాథముని ఆచార్యులు జీవిత విశేషాలతో నూతన శీర్షికలు రూపొందించి ప్రసారం చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
ఇటీవల ప్రారంభించిన ఎస్వీబిసి కన్నడ ఛానల్‌లో దాస సాహిత్యంలోని పాటలను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ” దాస నమనం ” కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా శ్రీ పురందరదాసుల సంకీర్తనలను త్వరలో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.
ఎస్వీబిసి చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీబిసి సీఈవో శ్రీ సురేష్ కుమార్ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.