ADMISSIONS INTO TTD COLLEGES UNDER MANAGEMENT QUOTA _ టీటీడీ కళాశాలలో యాజమాన్య కోట కింద అడ్మిషన్లు
Tirupati, 17 Jan. 22: TTD had invited applications from candidates for admission into its colleges under the Management Quota for the academic year 2021-22.
Interested candidates, children of TTD employees, Balamandiram students are eligible for admissions.
Interested and eligible candidates shall attend with Original certificates on 19-01-2022 in SV Arts, SPW Degree and PG, Sri Govinda Raja Swamy Arts colleges.
No hostel facility shall be provided to the students under Management Quota. Admissions through the Jagananna Vidya Deevena scheme are subjected to court directives.
As per the Government guidelines the seats will be allotted on a merit and reservation basis.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ కళాశాలలో యాజమాన్య కోట కింద అడ్మిషన్లు
తిరుపతి, 2022 జనవరి 17: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ఎస్.వి.ఆర్ట్స్ కళశాల, శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పిజి కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటాలో ప్రవేశానికి దరఖాస్తులు టీటీడీ ఆహ్వానిస్తున్నది.
ఆసక్తి గల విద్యార్థులు, టీటీడీ ఉద్యోగుల పిల్లలు, బాలమందిరంలో చదువుకున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ఆసక్తిగల విద్యార్థులు 19-01-2022న ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కాగలరు. యాజమాన్య కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వసతి కల్పించబడదు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పొందే ప్రవేశాలు న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.