AKHANDA HARINAMA SANKEERTANA RESUMES IN TIRUMALA _ తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

TIRUMALA, 01 AUGUST 2022: Akhanda Harinama Sankeertana resumed in Tirumala on Monday.

 

Speaking to the media on the occasion, TTD EO Sri AV Dharma Reddy said, Akhanda Harinama Sankeertana was launched by TTD in 2007 where in folk artists from AP, TS, TN and other states take part and present Sankeertans in folklore style. Due to Covid Pandemic, the Akhanda Harinama Sankeertana was stalled by TTD and again after a gap of two years resumed on August 1.

 

He said, every day a dozen teams consisting of 15 members per team present keertans in a folk style which runs round the clock all through the year.

 

The EO said there are 7500 odd teams with nearly 1.30 lakh registered artists who will get their turn to perform through a computerised allotment system. Each team performs for two hours in different shifts on a day and every day 12 teams including those from AP, TS and other states will present Sankeertans, he added.

 

These artists are provided with Accommodation, TA and other facilities.

 

Earlier the EO has commenced the Akhanda Harinama Sankeertana programme by lighting the lamp and performing Puja. SVBC has telecasted the program live between 5:30am and 6am on the opening day.

 

All Projects Program Officer Sri Vijayasaradhi, CEO SVBC Sri Shanmukh Kumar and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

తిరుమల, 2022 ఆగస్టు 01: అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరుమలలో తిరిగి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని జానపద శైలిలో భజనలు చేస్తున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని టిటిడి నిలిపివేసిందని, రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైందని చెప్పారు. ప్రతిరోజూ ఒక్కో జట్టులో 15 మంది చొప్పున 12 బృందాల్లో కళాకారులు పాల్గొంటారని, ఏడాది పొడవునా నడుస్తుందని ఆయన అన్నారు. 7500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు నమోదు చేసుకున్నారని, కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామని ఈఓ తెలిపారు.

ఒక్కో బృందం రోజుకు రెండు గంటలపాటు వివిధ షిఫ్టుల్లో ప్రదర్శన ఇస్తుందని ఈఓ తెలిపారు. ఈ కళాకారులకు వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ముందుగా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఈఓ జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ విజయసారధి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.