ALL INDIA CO-OPERATIVE WEEK CELEBRATIONS OBSERVED _ టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు అభివృద్ధికి సహకారం – టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, జెఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 17 NOVEMBER 2023: The TTD management is keen to support the development of TTD employees co-operative bank jointly asserted TTD board member Sri Yanadaiah and EO Sri Veerabrahmam.
Participating in the 70th All India Co-operative Week celebrations organised at SVETA Bhavan on Friday evening under the aegis of the TTD employees cooperative bank they complimented the team for sustaining the popularity and credibility of the Bank since its inception in 1939.
Addressing later they highlighted all the employee-friendly initiatives of TTD management led by Chairman Sri Bhumana Karunakar Reddy and EO Sri AV Dharma Reddy.
Besides declaring all support to bank activities like scholarships to meritorious children of employees and financial support to families of deceased employees, they wished the bank to continue to do wonders in cooperative sector.
They also distributed prizes to winners of Quiz contest held for the children of employees. They gave away silver medals for students who excelled in Tenth, Inter, degree classes besides extra-curricular activities.
TTD Employees Bank President Sri C.Kiran, Vice President Sri A Vasu, Treasurer Sri Muni Venkata Reddy, Directors Sri G Ventatesam, Sri K Gunasekar, Sri Siva Kumar, Smt Hemlata and TTD employees were also present.
టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు అభివృద్ధికి సహకారం – టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2023 నవంబరు 17: టీటీడీ ఉద్యోగుల కోసం నడుస్తున్న సహకార బ్యాంకు అభివృద్ధి కోసం యాజమాన్యం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన 70వ అఖిలభారత సహకార వారోత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ యాజమాన్యం ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, ఇందులో భాగంగా బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉద్యోగుల ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు చేపట్టారని తెలిపారు. ఎంప్లాయిస్ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్పులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో బ్యాంకు అంచలంచలుగా రాణించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
అనంతరం ఉద్యోగుల పిల్లలకు నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా 10వ తరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన వారికి వెండి పతకం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ బ్యాంకు ప్రెసిడెంట్ శ్రీ చీర్ల కిరణ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఏ.వాసు, ట్రెజరర్ శ్రీ ఏ.ముని వెంకటరెడ్డి డైరెక్టర్లు శ్రీ జి.వెంకటేశం, శ్రీ కె.గుణశేఖర్, శ్రీ శివకుమార్, శ్రీమతి హేమలత, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.