ALL SET FOR AKHILA BHARAT VEDA SHASTRA AGAMA VIDWAT SADASSU _ అఖిలభారత వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి
Tirumala, 24 February 2020: TTD has made elaborate arrangements for conduction of Akila Bharat Veda Shastra, Agama Vidwat Sadassu at Sri SV Veda Vignana Peetham, Dharmagiri from February 25-March 1.
Sri Sri Sri Vidyashankar Saraswati, the pontiff of Vidya Narasimha Ashram at Verur near Srirangam in Tamilnadu will present keynote address on Tuesday morning inaugurating the six-day Sadassu
The auditorium of the SV Veda Vidya Peetham is decked with flower and rangoli, decorations and nearly 715 students and 115 invigilators are participating in the annual Sadassu.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అఖిలభారత వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి
ఫిబ్రవరి 24, తిరుమల, 2020: తిరుమలలోని ధర్మగిరిలో గల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 28వ అఖిలభారత శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం వేద పాఠశాలలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. పుష్పాలంకరణలు చేపట్టారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు ఈ సదస్సు జరుగనుంది.
వేద విజ్ఞానపీఠంలోని సభా ప్రాంగణంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో తమిళనాడులోని శ్రీరంగం వద్ద గల నెరూరుకు చెందిన విద్యానరసింహ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకరసరస్వతి స్వామీజీ అనుగ్రహభాషణం చేయనున్నారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుండి 715 మంది విద్యార్థులు, 115 మంది పరీక్షాధికారులు పాల్గొంటారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.