ALL SET FOR BALALAYA FESTIVALS AT ALIPERI TEMPLES _ అలిపిరి పాదాల‌మండ‌పంలోని ఆలయాల బాలాల‌యానికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 23 Feb. 20: All arraignments are made for conduction of Balalaya ritual at the group of TTD local temples near Alipiri Padala mandapam fro. February 24-26. With Ankurarpanam on the evening of February 24th.

The Padala mandapam complex at Alipiri hosted Sri Lakshmi Narayana Temple, Sri Andal Ammavari temple, Sri Perialwar temple and Sri Bhaktanjaneya temple s as the gateway to walkers toot path.

Balalaya ritual comprised of akalmasha Homa, laghu Purnahuti in the morning of Monday and Punya havachanam with Agni pratista and kalakrshan and kumbharadhana homam in the evening.

On February 25th Tuesday morning Agni pranayanam, kumbharadhana for portraits, akalmasha Homa, laghu Purnahuti will be performed and Maha Shanti Purnahuti and mahashanti prokshana were performed in the evening.

On February 26th on the Phalguna Sudha tadhiya Mesha lagnam after Punya havachanam Ku bha aavahana will be conducted in the morning and temples will be thrown open for Sarva darshan.

Special grade DyEO of Sri Govindarajaswamy temple Smt Varalakshmi is supervising all arrangements for the three-day festival.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

అలిపిరి పాదాల‌మండ‌పంలోని ఆలయాల బాలాల‌యానికి ఏర్పాట్లు పూర్తి

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 23: తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని ఆల‌యాల‌కు ఫిబ్ర‌వ‌రి 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

పాదాల మండ‌పంలో శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, పెరియాళ్వార్ ఆల‌యం, శ్రీ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. బాలాల‌యంలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24న ఉద‌యం యాగ‌శాల‌లో అక‌ల్మ‌ష హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం పుణ్యాహ‌వ‌చ‌నంలో అగ్నిప్ర‌తిష్ట‌, క‌ళాక‌ర్ష‌ణ‌, కుంభారాధ‌న ఉక్త హోమాలు చేప‌డ‌తారు. ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, చిత్ర‌ప‌టాల‌కు కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం మ‌హాశాంతి పూర్ణాహుతి, బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు మ‌హాశాంతిప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌యం 7.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ ఫాల్గుణ శుద్ధ త‌దియ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.