ALL SET FOR CHATURVEDA HAVANAM _ చతుర్వేద హవనం నిర్వహణకు సర్వం సిద్ధం
TIRUPATI, 28 JUNE 2023: All arrangements are in place for the week-long Chaturveda Havanam which is organised by Tirumala Tirupati Devasthanam for the first time in the temple city of Tirupati which commences on Thursday.
Seeking the divine intervention for the well-being of the entire humanity TTD is conducting this unique maiden Homam in its Parade Grounds in Tirupati from June 29 to July 5.
The ritual event will begin with Kalasa Sthapana, Kalasa Avahana at 8am on Thursday. 32 Ritwiks will be reciting Mantras from four Vedas. In the evening devotional cultural programs have been arranged by the faculty and students of SV College of Music and Dance on all these days besides Annamacharya, HDPP and Dasa Sahitya Projects.
Necessary seating arrangements with shades have been made for the devotees to participate in this programme. The entire stage is arranged with colourful flowers and illumination.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చతుర్వేద హవనం నిర్వహణకు సర్వం సిద్ధం
– జులై 5వతేదీ వరకు హవనం
తిరుపతి, 28 జూన్ 2023: లోక కల్యాణార్థం జూన్ 29 నుండి జులై 5 తేదీ వరకు టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. టీటీడీ తొలిసారి తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
జూన్ 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు కలశ స్థాపన, కలశ ఆవాహన తో కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఇందుకోసం యజ్ఞ వేదిక, హోమ గుండాలు సిద్ధం చేశారు. 32 మంది రుత్వికులు నాలుగు వేదాల్లోని మంత్రాలు పఠిస్తూ హవనం నిర్వహిస్తారు.
భక్తులు కూర్చుని కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా మ్యాట్లు, చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, బ్యారికేడ్లు, భక్తులను ఆకట్టుకునేలా పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు చేశారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుర్వేద హవనంలో అన్ని వేదాల్లోని మంత్రాలు పఠిస్తూ హోమ కార్యక్రమాలు జరుగనున్నాయి.
సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు చతుర్వేద మంత్ర పారాయణం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 6-30 గంటల వరకు శ్రీ వై ఎల్ శ్రీనివాసులు, శ్రీ బి. కేశన్న బృందం నాదస్వరం, డోలు వాద్య సంగీతం నిర్వహిస్తారు. 6-30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు డాక్టర్ ఎ శబరి గిరీష్ బృందంచే భజనామృతం జరుగుతుంది. రాత్రి 7 నుండి 7-45 గంటల వరకు ఆచార్య చిర్రావూరి శ్రీరామ శర్మ చే చతుర్వేద హవనం – కార్య సిద్ధి అనే అంశంపై ప్రవచనం ఉంటుంది. రాత్రి 7-50 గంటల నుండి 8-30 గంటల వరకు శ్రీ పి.రవిసుబ్రహ్మణ్యం బృందం చే రామాయణం నృత్య రూపకం ప్రదర్శన ఉంటుంది.
భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.