ALL SET FOR GARUDA SEVA ON SEP 22_ సెప్టెంబరు 22న గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు
- FOCUS ON CONTINUOUS SUPPLY OF ANNAPARASADAM AT MADA STREET GALLERIES
- ACTION PLAN TO REFILL GALLERIES FOR SRIVARI DARSHAN TO MORE DEVOTEES
- EXTENSIVE SECURITY ARRANGEMENTS
Tirumala,21 September 2023: TTD has rolled out extensive arrangements for devotees service on Garuda Seva day on September 22.
The Mada streets had a capacity to accommodate nearly two lakh devotees. TTD intends to provide Srivari Vahana Darshan to crowds waiting on inner ring roads and Outer Ring Road through Supatham, Southeast corner, Govinda Nilayam, North West gate, North East gate into the Mada streets.
TTD is beginning the Vahana at 7.00 pm and last till 02.00 hours the next day and appealed to all devotees to patiently comply with security restrictions.
Similarly, the Anna Prasadam will be served at the Matrusri Vengamamba Anna Prasadam Bhavan from 8.00 am to 01.00 hours midnight and distribute varieties of mixed rices at regular intervals in galleries. Besides 2.5 lakh packets of buttermilk are readied and nearly 747 sanitisation workers were deputed to clean Mada streets, galleries, rest houses, toilets for Garuda Seva day. 524 drinking water drums kept and 1500 srivari Sevakulu deployed on Mada streets.
Among others, 1130 TTD vigilance staff, 3600 policemen and another 1200 are deployed on Garuda Seva day, 2770 CCTV cameras vigil the activities. Plying of two-wheelers banned on ghat roads from 6pm of 21 till 6am of 23.
Parking facilities were created at old Alipiri. Checkpoint and RTC buses to run 3000 trips. Four Mobile battery vehicle clinics, seven ambulances, doctors and paramedics also organised.TTD has also installed 20 huge LED screens all around Mada streets, SV Museum, Varahaswamy Rest house Annadanam complex Rambagicha rest house etc.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 22న గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు
– గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు
– ఎక్కువ మందికి దర్శనం కల్పించేందుకు గ్యాలరీల రీఫిల్లింగ్ ఏర్పాట్లు
– పటిష్ట భద్రతా ఏర్పాట్లు
తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం జరుగనున్న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముంది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు కదిలేలా ప్రణాళిక రూపొందించారు. గరుడసేవ దర్శనం కోసం బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని కోరడమైనది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. గ్యాలరీల్లోనూ ఉదయం నుండి రాత్రి వరకు పులిహోర, టమోటా బాత్, బిసిబెళాబాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 247 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 774 మందిని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటుచేసి శ్రీవారి సేవకుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలకు దాదాపు 1130 మంది టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సిసి కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. ఆర్‌టిసి బస్సుల్లో 3 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు వైద్యసేవల కోసం మాడవీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 7 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేస్తారు.
గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్ హౌస్ ఇతర ప్రాంతాల్లో కలిపి 20 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.