ALL SET FOR INAUGURATION OF SRI VAKULAMATA TEMPLE BY AP CM- MINISTER SR PEDDIREDDI RAMACHANDRA REDDY _ జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి హాజరు
Tirupati, 22 June 2022: The AP Minister for Energy, Environment and Mining Sri Peddireddi Ramachandra Reddy said all arrangements are in place for the inauguration of the prestigious Sri Vakulamata temple near Patakalva (Perur Banda) by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on June 23.
Speaking to the media after inspecting the arrangements on Wednesday at Sri Vakulamata temple he said it took three years for the temple rejuvenation as per the directions of AP CM over 83.42 acres where TTD has is building a Kalyana Mandapam and a rest house.
He said the temple will open up for the darshan of devotees from June 23 afternoon onwards and will be developed as a pilgrim tourism hub.
TTD Agama advisor Dr Vedantam Vishnu Bhattacharyulu said as per Skanda, Varaha, and Bhavisyottara Puranas Sri Vakulamata is believed as the iconic mother of Sri Venkateswara.
Narrating the significance of the temple he said the temple rejuvenated as per Agama Shastra and the gopuram has been gold plated with 20 kg gold with the support of TTD.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి హాజరు
– ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి
– రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి, 2022 జూన్ 22: తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద ( పేరూరు బండపై) నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో జూన్ 23వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీ వకుళ మాత ఆలయం వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ సహాకారంతో శ్రీ వకుళ మాత ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల కాలంలో ఆలయాన్ని రాతి కట్టడం, అద్బుత శిల్ప కళతో నిర్మించినట్లు చెప్పారు. వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం నుండి శ్రీ వకుళమాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు వివరించారు.
టీటీడీ వైఖానస ఆగమ సలహా దారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ, స్కంధ, వరాహ, భవిష్యోత్తర పురాణాల ప్రకారం శ్రీ వకుళ మాత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మాతృమూర్తి అని చెప్పారు. ప్రాచీనమైన శ్రీ వకుళ మాత ఆలయం పేరూరు బండపై ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇంత గొప్ప ఆలయం కాల క్రమంలో శిధిలావస్థకు చేరుకుందని, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా, ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించినట్లు తెలిపారు. మంత్రి దాదాపు 20 కేజిల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు, విమానానికి ఒక కలశం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జూన్ 19 నుండి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.