ALL SET FOR MAHA SARASWATHI YAGAM _ మ‌హాస‌ర‌స్వ‌తియాగానికి ఏర్పాట్లు పూర్తి

Tirupati, 19 Feb. 20: As a part of its commitment for propagation of Hindu Sanatana Dharma, the Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD is organising the Maha Saraswathi Yagam on February 20 

Nearly 10,000 students of 8th, 9th and 10th standards apart from inter, degree students studying in TTD educational institutions and others will participate in the holy event that will take place in the spacious grounds of SV High School in Tirupati on Thursday.

The objective of the Yagam is also to beget blessings of Goddess of Wisdom-Sri Saraswathi Devi to the students who are appearing for various annual examinations. 

TTD has set up six homa lots with 10 Ritwiks performing from 6:30am on Thursday at the Geeta Jayanti Grounds (of SV high school). The rituals include Anujna, Punyavaham, Saraswati Aradhana, and Kalasharadhana and conclude with Purnahuti and Prasadam distribution. The students will also be presented with Vidya Kankanams (holy threads to be tied on hand).

Acharya K Rajagopalan, Secretary of HDPP and Dr R Ramana Prasad, Devasthanams Education Officer is supervising the arrangements for the big fete.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

మ‌హాస‌ర‌స్వ‌తియాగానికి ఏర్పాట్లు పూర్తి

ఫిబ్రవరి 19, తిరుపతి, 2020: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, విద్యా విభాగం సంయుక్తాధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 20న తిరుప‌తిలోని గీతాజ‌యంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) సుమారు 10 వేల మంది విద్యార్థులతో మ‌హాస‌ర‌స్వ‌తి యాగం నిర్వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న వార్షిక‌ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థిని విద్యార్థులు విజ‌యం సాధించాల‌ని శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని ప్రార్థించేందుకు ఈ యాగం త‌ల‌పెట్టారు. ఇందుకోసం టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ యాగం నిర్వ‌హ‌ణ కోసం 6 హోమ‌గుండాల‌ను ఏర్పాటు చేశారు. 10 మంది రుత్విక్కులు స‌ర‌స్వ‌తీ యాగం నిర్వ‌హిస్తారు. విద్యార్థిని విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా త‌గిన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉద‌యం 6 గంట‌ల‌కు అనుజ్ఞ, పుణ్యాహం, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స‌ర‌స్వ‌తీ దేవి ఆరాధ‌న‌, క‌ల‌శారాధ‌న‌, నివేద‌న చేప‌ట్టి మ‌హాస‌ర‌స్వ‌తీ యాగాన్ని ప్రారంభిస్తారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు పండితుల సందేశం ఉంటుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు పూర్ణాహుతి, ప్ర‌సాద విత‌ర‌ణ‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టిటిడి విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌లు, ధార్మిక సంస్థ‌ల్లో 8, 9, 10 త‌ర‌గ‌తులు, ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దువుతున్న విద్యార్థిని విదార్థులు ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు. పూర్ణాహుతి  స‌మ‌యంలో ప‌ఠించేందుకు వీలుగా విద్యార్థుల‌కు స‌ర‌స్వ‌తి మంత్రం కాపీల‌ను స‌ర‌ఫ‌రా చేస్తారు. పాల్గొన్న విద్యార్థులంద‌రికీ విద్యాకంక‌ణం, పుస్త‌కం, పెన్ను అందజేస్తారు. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాజ‌గోపాల‌న్‌, విద్యాశాఖాధికారి డా. ఆర్‌.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.