AMNAKSHI AMMA BRAHMOTSAVAMS _ ఆగస్టు 22 నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 21 AUGUST 2023: The annual brahmotsavams of Avanakshi also known as Amnakshi Amma temple located in Narayanavanam is scheduled between August 22-September 08.
As part of Abhishekam, processions will be performed on these days. The devotees from surrounding villages participate in large numbers in this annual fete.
ఆగస్టు 22 నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2023 ఆగస్టు 21: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్నశ్రీ ఆమ్నాయాక్షి(అవనాక్షి) అమ్మవారి ఆలయంలో ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఆగస్టు 22వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు కంకణ ధారణ నిర్వహించనున్నారు. ఆగష్టు 29వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అభిషేకం, సెప్టెంబరు 5వ తేదీన ఉదయం 7 నుండి 9 గంటల వరకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, సెప్టెంబరు 7వ తేదీ సాయత్రం 6 గంటల వరకు కీలాగారం గ్రామంలో శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారు ఊరేగి గ్రామస్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సెప్టెంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి నారాయణవనం సముదాయం, కీలాగారం గ్రామాలలో అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.