ANCIENT ARTEFACTS DONATED TO SV MUSEUM _ ఎస్వీ మ్యూజియానికి పురాత‌న వ‌స్తువులు విరాళం

Tirumala,31 August 2023: A devotee from US, Smt Vinjamuri Sandhya on Thursday donated ancient artefacts worth lakhs to the SV Museum of Tirumala and same were handed over to TTD EO Sri AV Dharma Reddy.

The artefacts included musical instruments like Tambura, Veena besides Panchaloha idol of Sri Nammalwar, Mini Bhagavad Gita, Silver framed portraits of Sri Venkateswara Swami and Sri Padmavati Ammavaru, artefacts made in ivory etc.

Smt Sandhya happens to be the grand daughter of the prominent Carnatic Music exponent Dr Vinjamuri Varadaraja Iyengar.

Dr. Iyyangar was a contemporary of exponents like Smt MS Subbulakshmi, Sri Veturi Prabhakar Shastri and Sri Rallapalli Ananta Krishna Sharma who all participated in the Annamacharya festivities.

Museum Officer of TTD Dr Krishna Reddi was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ మ్యూజియానికి పురాత‌న వ‌స్తువులు విరాళం

తిరుమల, 2023, ఆగ‌స్టు 31: యుఎస్ఎలో ఉంటున్న‌ శ్రీ‌మ‌తి వింజ‌మూరి సంధ్య తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియానికి ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ‌చేసే పురాత‌న వ‌స్తువుల‌ను విరాళంగా అంద‌జేశారు. వీటిని గురువారం తిరుమ‌ల‌లో ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి చేతుల‌మీదుగా అంద‌జేశారు.

డా. వింజ‌మూరి వ‌ర‌ద‌రాజ అయ్యంగార్ ప్ర‌ముఖ క‌ర్ణాట‌క సంగీత విద్వాంసులు. వీరు టీటీడీ ఉత్స‌వాల్లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. అన్న‌మాచార్య ఉత్స‌వాలు ప్రారంభించిన నాటి నుండి ప్ర‌ముఖ సంగీత విద్వాంసులుగా ఉన్నారు. వీరు శ్రీ‌మ‌తి ఎంఎస్‌.సుబ్బ‌ల‌క్ష్మి, శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి, శ్రీ రాళ్ల‌ప‌ల్లి అనంత‌కృష్ణ‌శ‌ర్మ‌తో క‌లిసి ప‌నిచేశారు. వీరు ఉప‌యోగించిన‌, సేక‌రించినవాటిలో తంబూరాలు, వేణువులు సంగీత ప‌రిక‌రాలతో, వారు పూజించిన పంచ‌లోహ శ్రీ న‌మ్మాళ్వార్ విగ్ర‌హం, చిన్న భ‌గ‌వ‌ద్గీత‌, వెండితో చేసిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అమ్మ‌వార్ల ప‌టాలు, దంత‌పు న‌గిషీలు చెక్కిన క‌ళాఖండాలు ఉన్నాయి. వీటిని ఆయ‌న కుమార్తె శ్రీమ‌తి సంధ్య మ్యూజియానికి అంద‌జేశారు.

మ్యూజియం అధికారి డా. కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.