ANDAL GODADEVI MALAS REACHES TIRUMALA _ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరు మాలలు

Tirumala, 27 September 2025: As part of the ongoing annual Salakatla Brahmotsavams, the sacred garlands of Sri Andal from Srivilliputhur, Tamil Nadu, arrived in Tirumala on Saturday to adorn Sri Venkateswara during the Garuda Seva.

The garlands were first brought to Sri Pedda Jeeyar Mutt near Sri Bedi Anjaneya Swamy Temple in Tirumala, where special pujas were performed under the supervision of HH Sri Sri Sri Pedda Jeeyar Swamy and HH Sri Sri Sri Chinna Jeeyar Swamy.

Later, amidst the playing of traditional mangala Vaidyams, the garlands were taken in a ceremonial procession along the four mada streets and carried into the Tirumala temple.

Two sets of garlands are called Andal or Sikkamani Malas.

The Andal garlands, also known as the Sikkamani malas, consist of two special flower garlands prepared and offered every year by two families of traditional florists from Srivilliputhur in Tamil Nadu, located about 650 km away from Tirupati.

The event was attended by Tamil Nadu Endowment Joint Commissioner Sri Mariyappan, EO Smt Chakkarai Ammal, Tirumala Temple Dy EO Sri Lokanatham, Srivilliputhur temple Sthanacharya Sri Ramesh Rangarajan, and others.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

తిరుమల, 2025 సెప్టెంబర్ 27: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంత‌రం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :

ఆండాళ్ మాల –  మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్ మారియప్పన్, ఈవో శ్రీ చక్కరై అమ్మాళ్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.