ANDAL GODAI MALAS DECKED TO MULA VIRAT _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు
Tirumala, 16 Jan. 22: On the auspicious occasion of Goda Parinayotsavam on Sunday, the Andal Sri Goda garlands brought from Sri Govinda Raja Swamy temple (Sri GT) in Tirupati were decorated to the presiding deity of Sri Venkateswara Swamy.
It’s a tradition that every year, Goda Malas are brought from Sri GT to Sri Pedda Jeeyar Mutt in Tirumala.
After performing special pujas to these divine garlands were brought in a procession from Pedda Jeeyangar Mutt to Tirumala temple amidst Mangala Vaidyas and decked to Mula Virat.
Both the Senior and Junior Pontiffs of Tirumala, Spl Gr DyEO Sri Rajendrudu, Tirumala Temple DyEO Sri Ramesh Babu, Temple Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
తిరుమల, 2022 జనవరి 16: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు ఆదివారం ఉదయం అలంకరించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియర్‌స్వామివారి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజియర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.