ANIVARA ASTHANAM AT SRIVARI TEMPLE ON JULY 17 _ జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
KOIL ALWAR TIRUMANJANAM ON JULY 14
NO VIP BREAK DARSHANS ON JULY 14 AND 17
Anivara Asthanam, the annual traditional accounting fete will be held in a grand manner at Srivari Temple on July 17.
In connection with this fete, the traditional temple cleaning ritual, the Alwar Tirumanjanam will be held on July 14.
Following these two religious events, the TTD has cancelled VIP Break Darshans on these two days except for protocol dignitaries.
Therefore recommendation letters for VIP Break Darshans will not be accepted on July 13 and 16.
The devotees are requested to make note of these changes and cooperate with TTD.
On the other hand, Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva also remains cancelled on July 17.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2026 జూలై 04: జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ కారణంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు టీటీడీ రద్దు చేసింది.
జూలై 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
అదేవిధంగా జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
