ANIVARA ASTHANAM IN LOCAL TEMPLES OF TTD _ జూలై 16న టీటీడీ స్థానికాలయాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
TIRUPATI, 14 JULY 2024: TTD is all set to observe the traditional annual budget fest, Anivara Asthanam that takes place on the day of Ani (Tamil) month which falls on July 16 this year.
In Sri Govindaraja Swamy temple in Tirupati, this fete is observed in the evening between 5:30pm and 7pm.
In Sri Kodanda Ramalayam in Tirupati, special Asthanam will be observed between 4pm and 5pm.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 16న టీటీడీ స్థానికాలయాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుపతి, 2024 జూలై 13: తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయంలో జూలై 16వ తేదీ ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించనున్నారు.
శ్రీ కోదండరామాలయంలో
శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకుఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జీయర్ స్వామిలు, ఆలయ అధికారులు పాల్గొననున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.