ANKURARPANA FOR DHWAJASTAMBHA JEERNODHARANA HELD_ శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ధ్వజస్థంభ జీర్ణోదరణకు అంకురార్పణ

Tirupati/Vontimitta, 27 August 2025: The Ankurarpanam was held on Wednesday evening as a part of Dhwajastambha Jeernodharana at the Vontimitta Sri Kodandarama Swamy temple. 

In the evening Vishwaksena Aradhanam, Punyahavachanam, Rakshabandhanam and Ankurarpanam were performed.

On August 28 at 9 am, Vedic rituals, Vastu Homam, Panchagavya Snapanam, Kumbhasthapanam, Sayyadhivasam and Tattva Homa will be performed in the temple Yagasala.

Temple officials and priests participated in this ritual.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ ధ్వజస్థంభ జీర్ణోదరణకు అంకురార్పణ

తిరుపతి / ఒంటిమిట్ట, 2025 ఆగస్టు 27: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోదరణకు బుధవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రక్తంగా అంకురార్పణ నిర్వహించారు . 

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి, అర్చన జరిగింది. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేనారాదన, పుణ్యాహవచన, రక్షాబంధన, అంకురార్పణ నిర్వహించారు.

ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తు హోమం, పంచగవ్య స్నపనం,  కుంభస్థాపనం, సయ్యాధివాసం, తత్వ హోమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ  అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.