ANKURARPANA FOR SODASADINA BALAKANDA PARAYANAM HELD _ తిరుమలలో ” షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష ” కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
TIRUMALA, 02 SEPTEMBER 2021: The Ankurararopanam for the unique spiritual program, Sodasadina Balakanda Parayanam was held at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Saturday evening.
This event will last for 16 days from September 3 to 18 at Vasantha Mandapam between 8:30am and 10am.
The entire event will be live telecasted on SVBC for the sake of global devotees.
While 16 Vedic Scholars recite shlokas another 16 will perform Yagam at Dharmagiri.
As a traditional practice, the beejavapanam ceremony seeking the successful completion of these 16-day spiritual event was held amidst chanting of Vedic hymns.
Principal Sri KSS Avadhani, Temple OSD Sri P Seshadri, faculty and students of Dharmagiri Vedic institution were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ” షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష ” కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల, 2021 సెప్టెంబరు 02: లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో సెప్టెంబరు 3వ తేదీ నుండి టిటిడి నిర్వహించనున్న ” షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష ” కార్యక్రమానికి గురువారం రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సంకల్పం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్పణ నిర్వహించారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో 32 మంది ప్రముఖ పండితులు పాల్గొంటున్నారు. ఇందులో 16 మంది వేద పండితులు ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వహిస్తారు. వసంత మండపంలో సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు 16 మంది పండితులు బాలకాండలోని శ్లోకాలను పారాయణం చేయనున్నారు.
ఇందులో పాల్గొనే పండితులు ఒక పూట ఆహారం స్వీకరించి, రెండవ పూట పాలు, పండ్లు స్వీకరిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపై పడుకుంటారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్ డి శ్రీ పాల శేషాద్రి, వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.