ANKURARPANA HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
TIRUPATI, 23 JULY 2022: The Ankurarpana for the annual Pavitrotsavams was observed in Sri Kodanda Ramalayam on Saturday evening.
The ”Sin free” festival will be observed between July 24 and July 26.
Temple DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju, Chief Priest Sri Ananda Kumar Deekshitulu, Superintendent Sri Ramesh and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2022 జూలై 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు . యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 24వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, జూలై 25న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 26న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.