ANKURARPANA HELD _ శాస్త్రోక్తంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

TIRUPATI, 04 JULY 2025: The Ankurarpanam for annual brahmotsavams at Sri Sowmyanadha Swamy in Nandaluru of Annamaiah district was held on Friday evening.

The annual fete will be observed from July 05 to 13 by TTD in the temple in a grand manner.

Temple Superintendent Sri Hanumabtaiah, temple inspector Sri Dilip and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

తిరుపతి, 2025, జూన్ 04: అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీసౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో జూలై 05  నుండి 13వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

జూలై 05 ధ్వజారోహణం :

జూలై 05వ తేదీ శనివారం ధ్వజారోహణంతో శ్రీ సౌమ్యనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పలు కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 – 11.00 గం.ల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 05 గం.లకు ఊంజల్ సేవ, రాత్రి 07.00 గం.లకు యాళివాహనం, చతుస్థానార్చనము జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలలో స్వామివారు విహరిస్తారు.  

ఆలయ చరిత్ర : శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ నిర్మాణానికి 11వ శతాబ్ధంలో చోళవంశరాజు కుళోత్తుంగ చోళుడు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయం నిర్మాణం కొనసాగి, మట్టిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టింటినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు దగ్గరలో ఉన్నందున అన్నమాచార్యుల వారు శ్రీవారిని దర్శించి స్వామివారిపై కీర్తనలు రచించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలో ఎటువంటి దీపం లేకున్నా స్వామివారు ఉదయం నుండి సాయంకాలం వరకు దేదీప్యమానముగా వెలుగొందే విధముగా ఆలయమును నిర్మించడం ఒక అద్భుతం. సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించే విధముగా శిల్పులు నిర్మించారు.  

వాహనసేవల వివరాలు :

తేదీ

05-07-2025

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

06-07-2025

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

07-07-2025

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

08-07-2025

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హనుమంత వాహనం

09-07-2025

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

10-07-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

11-07-2025

ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)

రాత్రి – గజ వాహనం

12-07-2025

ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)

రాత్రి – అశ్వవాహనం

13-07-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.