ANKURARPANA HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 21 Feb. 22: The Beejavapanam or Ankurarpana for annual Brahmotsavams in Sri Kapileswara Swamy temple at Tirupati was held on Monday evening.
The annual fete will be observed from February 22 to March 3 in Ekantam due to Covid 19 restrictions.
Dhwajarohanam will be performed on February 22 in the Meena Lagnam at 8:10am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2022 ఫిబ్రవరి 21: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సాయంత్ర 6.30 నుండి అంకురార్పణ కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి 22న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 22 వ తేదీ ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనం ఆస్థానం జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 8 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాస నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.