ANKURARPANA HELD FOR JUBILEE HILLS VENKATESWARA BTUs _ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati, 28 February 2022: Ankurarpana for the annual brahmotsavams at Sri Venkateswara Swamy temple in Jubilee Hills was held on Monday evening.

 

The nine-day Brahmotsavams will be observed from March 1 till March 9.

 

On March 1, Dhwajarohanam will be performed in Mesha Lagnam between 10:30am and 10:40am followed by Pedda Sesha Vahanam in the evening.

 

LAC chief of Hyderabad Sri Bhaskar Rao, members, temple staffs were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 28: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఆలయంలో మార్చి 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

అంకురార్ప‌ణ సందర్భంగా సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు మృత్సంగ్ర‌హ‌ణం, పుణ్యాహ‌వ‌చ‌నం, శ్రీ విష్వక్సేనులవారికి సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

మార్చి 1న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 నుండి 10.40 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో శాస్త్రోక్తంగా ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టం జ‌రుగ‌నుంది. అంత‌కుముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో హైద‌రాబాద్ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ భాస్క‌ర్ రావు, ఉపాధ్యక్షులు శ్రీ ర‌వి ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌తి కోమ‌టిరెడ్డి లక్ష్మి, శ్రీ వెంక‌ట‌రెడ్డి, ఇత‌ర స‌భ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.