ANKURARPANA PERFORMED FOR PAVITHROTSAVAM AT CHANDRAGIRI SRI KODANDARAMA SWAMY TEMPLE _ చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirumala, 11 October 2025: Ankurarpana, the ceremonial commencement of the annual Pavithrotsavam rituals, was performed on Saturday evening at Sri Kodandarama Swamy Temple, Chandragiri in a traditional and devotional manner. As part of the programme, Senadhipati Utsavam, Mritsangrahanam, Raksha Bandhanam, and Medini Puja were conducted from 6 PM onwards.
Pavithrotsavam is performed to purify and rectify any ritual lapses that might have occurred knowingly or unknowingly during temple worship and festivals throughout the year, in accordance with Agama traditions.
The schedule of rituals is as follows:
October 12: Chatursthana Archana and Pavitra Pratishtha from 7 AM to 9 AM, followed by Pavitra Homam in the evening.
October 13: Vedic rituals in Yagashala from 7 AM to 9 AM, Pavitra Samarpana from 9 AM to 10 AM, and Pavitra Homam in the evening.
October 14: Maha Poornahuti, Kumbhabhishekam, Pavitra Visarjana, Snapana Tirumanjanam, Chakra Snanam, followed by Veedhi Utsavam at 6 PM.
Devotees (two persons as a couple) can participate in this Paid Seva by paying Rs. 200. Participants will receive Pavitra Mala and Teertha Prasadam as blessings.
Temple Inspector Sri Muni Haribabu and other officials participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2025 అక్టోబరు 11: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి.
అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు , ఇతర అధికారులు పాల్గొన్నారు.


