ANKURARPANA PERFORMED TO YUDDAKANDA PARAYANAM _ తిరుమలలో ”యుద్ధకాండ పారాయణ ” కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్ఫణ
TIRUMALA, 10 June 2021: As the month-long Yuddhakanda Parayanam is going to commence on Friday, the Ankurarpanam fete was performed on Thursday evening at Dharmagiri Veda Vignana Peetham in Tirumala.
Sankalpam, Ganapathi Puja, Punyahavachanam, Ritwikvaranam, Kankanadharana, Agnipratistha, Ankuraropanam were carried out in a religious manner.
From Friday onwards 32 Vedic Pundits with 16 members each at Vasantha Mandapam and Dharmagiri will perform Yuddhakanda Parayanam till July 10. While Vedic scholars chant shlokas from Yuddhakanda in Vasantha Mandapam, the Ritwiks perform Japa and Homam in Dharmagiri during this period.
TTD Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath, Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ”యుద్ధకాండ పారాయణ” కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్ఫణ
తిరుమల, 2021 జూన్ 10: లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో జూన్ 11వ తేదీ నుండి టిటిడి నిర్వహించనున్న యుద్దకాండ పారాయణం కార్యక్రమానికి గురువారం రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థన మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్ఫణ నిర్వహించారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో 32 మంది ప్రముఖ పండితులు పాల్గొంటున్నారు. ఇందులో 16 మంది వేద పండితులు ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వహిస్తారు. వసంత మండపంలో జూన్ 11 నుండి జూలై 10వ తేదీ వరకు 16 మంది పండితులు యుద్ధకాండలోని శ్లోకాలను పారాయణం చేయనున్నారు.
ఇందులో పాల్గొనే పండితులు ఒక పూట ఆహారం స్వీకరించి, రెండవ పూట పాలు, పండ్లు స్వీకరిస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, నేలపై పడుకుంటారు. ఆరోగ్య నియమాలు పాటిస్తూ నిత్యం భగవన్నామస్మరణ చేస్తుంటారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్,వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.