ANKURARPANAM AT SRI PAT ON JAN 20 FOR SRI YAGAM FETE FROM JAN 21-27 _ జ‌న‌వ‌రి 21 నుండి 27వ తేదీ వ‌రకు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం

Tirupati, 19 Jan. 22: TTD is organising Ankurarpanam on January 20 at Sri Padmavati Temple, Tiruchanoor in connection with the Sri Yagam fete for the well-being of humanity from January 21-27.

In view of covid guidelines, the event will be performed in Ekantha at the Sri Krishna Mukha Mandapam with Sri P Srinivasan as Pradhana Archaka and the proceedings will be telecasted live by the SVBC.

The Sri Yagam rituals will be held from January 22 onwards after initiation activities on January 21.

In view of the glorious fete from January 20-27 TTD has cancelled all arjita sevas viz. Kalyanotsavam and Unjal seva from January 20-27 and break Darshan on January 20,21 and 27.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 21 నుండి 27వ తేదీ వ‌రకు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం

జ‌న‌వ‌రి 20న అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 19: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ జ‌న‌వ‌రి 21 నుండి 27వ తేదీ వ‌రకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో ఏకాంతంగా ఈ యాగం జ‌రుగ‌నుంది. అర్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస‌న్ ఈ యాగానికి ప్ర‌ధానాచార్యులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ యాగ కార్య‌క్ర‌మాల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా భక్తులు వీక్షించ‌వ‌చ్చు.

జ‌న‌వ‌రి 20న గురువారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

జ‌న‌వ‌రి 21న మొద‌టిరోజు ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు యాగశాల హోమాలు, చ‌తుష్టానార్చ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, నిత్య‌పూర్ణాహుతి, నివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి నిర్వ‌హిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు. జ‌న‌వ‌రి 22 నుండి 26వ తేదీ వ‌రకు ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 5 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌యాగం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

జ‌న‌వ‌రి 27న చివ‌రిరోజు ఉద‌యం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, మ‌హాశాంతి హోమం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు మ‌హాపూర్ణాహుతి చేప‌డ‌తారు. ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం మ‌రియు అవ‌భృతం నిర్వ‌హిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

శ్రీయాగం కార‌ణంగా జ‌న‌వ‌రి 20 నుండి 27వ తేదీ వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది. జ‌న‌వ‌రి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.