ANKURARPANAM FETE HELD AT AMARAVATI SV TEMPLE _ అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Amaravati, 4 Jun. 22: As part of Maha Samprokshana celebrations at the newly built Sri Venkateshwara temple in Amaravati from June 5-9, TTD organised an imposing Ankurarpanam fete on Saturday evening.

Earlier as part of festivities Shobha Yatra, Punya Havachanam, Acharya Ritwik varanam, Mrutsa grahanam were performed,

The daily program of the Maha Samprokshana are as follows.

JUNE 5

On June 5 Vedic rituals will commence Punyahavachanam, Panchangavyadhivasam, in the morning and homas in the evening.

June 6: After Nava Kalasha snapana kshiradhivasam morning homas will be continued in yagashala in the evening.

June 7: The festivities of chaturdasha kalasha snapana Jaladhivasan will be observed in the morning yagashala programs continued in evening.

June 8: The programs include Vimana Kalash sthapana, gopura Kalash sthapana and vigraha sthapana followed by snapana thirumanjanam in the afternoon and later in evening the rituals of Maha shanti thirumanjanam are observed yagashala at night.

June 9: The rituals begin with Maha Purnahuti, Vimana gopura Kalash avahana, Prabandam pratista, and the grand maha Samprokshana between 7.30-8.30 pm.

The devotees are allowed Srivari Dharshan for 10.30 am and later in the evening the celestial event of Shanti Kalyanotsavam is conducted.

TTD vaikanasa Agama adviser Sri Vedanta Vishnu Bhattacharya, DyEO Sri Gunabhushana Reddy, Dharmic projects officer Sri Vijayasaradhi, Dasa Sahitya project OSD Sri Anandathirtha Charyulu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2022 జూన్ 04: అమ‌రావ‌తిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 5 నుండి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ముందుగా శోభాయాత్ర జ‌రిగింది. ఆ త‌రువాత పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ ఘ‌ట్టాలు చేప‌ట్టారు.

రోజువారీ కార్య‌క్ర‌మాలు

జూన్ 5న ఉద‌యం పుణ్యాహ‌వ‌చ‌నం, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం హోమాలు నిర్వ‌హిస్తారు. జూన్ 6న ఉద‌యం న‌వ క‌ల‌శ స్న‌ప‌న క్షీరాధివాసం, సాయంత్రం హోమాలు, యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. జూన్ 7న ఉద‌యం చ‌తుర్ధ‌శ క‌ల‌శ స్న‌ప‌న జ‌లాధివాసం, సాయంత్రం యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. జూన్ 8న ఉద‌యం 10.45 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విమాన క‌ల‌శ స్థాప‌న‌, గోపుర క‌ల‌శ స్థాప‌న‌, విగ్ర‌హ స్థాప‌న, మ‌ధ్యాహ్నం స్న‌ప‌న తిరుమంజ‌నం చేప‌డ‌తారు. సాయంత్రం మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

జూన్ 9న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న, ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10.30 నుండి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఎఈవో శ్రీ దొరస్వామి నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.