ANKURARPANAM FOR NARAPURA VENKATESWARA SWAMY BRAHMOTSAVAMS _ జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రక్తంగా అంకురార్పణ
Tirupati, April 30, 2026:Ankurarpanam for the annual Brahmotsavams of Sri Narapura Venkateswara Swamy Temple, Jammalamadugu, was performed on Thursday evening as per tradition.
The Brahmotsavams will begin with Dwajarohanam on May 1. The temple has been beautifully decorated and arrangements are in place for devotees.
Officials and priests participated in the rituals.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రక్తంగా అంకురార్పణ
– మే 1న ధ్వజారోహణం
తిరుపతి, 2026 ఏప్రిల్ 30: జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.
మే 1న ధ్వజారోహణం :
మే 1వ తేదీ శుక్రవారం ఉదయం 9. 30 నుంచి 10.15 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



