ANKURARPANAM FOR SRI KODANDARAMA SWAMY PUSHPA YAGAM ON APRIL 22 _ ఏప్రిల్ 22న శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

Tirupati, April 20, 2026: Ankurarpanam for the Pushpayagam of Sri Kodandarama Swamy will be performed on April 22 at the Sri Kodandarama Swamy Temple in Tirupati, from 6:00 PM to 8:30 PM.

It is known that the annual Brahmotsavams were held in this temple from March 17 to 25. Pushpayagam is performed as a ritual of atonement for any lapses that might have occurred unknowingly by priests, officials, or devotees during the Brahmotsavams.

On April 23, Snapana Tirumanjanam will be performed to the Lord and Goddess from 11:00 AM to 12:30 PM. Later, from 4:00 PM to 6:00 PM, Abhishekam will be performed to Sri Kodandarama Swamy along with Sita and Lakshmana using various types of flowers.

At 7:00 PM, the Lord along with Sita and Lakshmana will take a procession along the four Mada streets of the temple and bless the devotees.

Devotees (a couple) can participate in the Pushpayagam by purchasing a ticket worth Rs.1,000.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI            

ఏప్రిల్ 22 శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుపతి, 2026 ఏప్రిల్ 20: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగానికిసంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు జరుగనుంది.

ఈ ఆలయంలో మార్చి 17 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడిన విషయంతెలిసిందే. బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకుప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులవిశ్వాసం.

ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారు, అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.00 గంటలకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకుదర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

ఈ పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది