ANKURARPANAM FOR SRI KONETIRAYA SWAMY BRAHMOTSAVAMS _ కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, April 23, 2026: Ankurarpanam and Senadhipathi Utsavam were performed on Wednesday evening for the annual Brahmotsavams of Sri Konetiraya Swamy at Keelapatla in Chittoor district.

The Brahmotsavams will be held from April 24 to May 3. All arrangements have been completed.

The festival will begin with Dwajarohanam on April 24 morning. Daily Vahana Sevas will be held from 8 AM to 10 AM and 7 PM to 9 PM.

Kalyanotsavam will be conducted on April 28 evening. Pushpayagam will be held on May 3.

Special spiritual and cultural programmes will be organised daily.

Temple officials participated in the event. Devotees are requested to attend in large numbers.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

ఏప్రిల్ 24 నుండి మే 03 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026, ఏప్రిల్ 23: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మోహన రమణ పాల్గొన్నారు.

ఏప్రిల్ 24 ధ్వజారోహణం :

ఏప్రిల్ 24న శుక్రవారం ఉదయం 09.05 గం.ల నుండి 09.15 గం.ల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.  శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహనసేవలు భక్తులను అలరించనున్నాయి.

వాహనసేవల వివరాలు:

ఏప్రిల్ 24

ఉదయం – ధ్వజారోహణం (మిథున లగ్నంలో ఉ. 9.05 నుండి 9.15 వరకు)

సాయంత్రం – శేష వాహనం

ఏప్రిల్ 25

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

ఏప్రిల్ 26

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

ఏప్రిల్ 27

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

ఏప్రిల్ 28

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

ఏప్రిల్ 29

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

ఏప్రిల్ 30

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

మే 01

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వ వాహనం

మే 02

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

కల్యాణోత్సవం :

ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

మే 03న సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు:

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది