ANKURARPANAM FOR SRI PADMAVATHI AMMAVARI VASANTHOTSAVAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
Tirupati, April 29, 2026: Ankurarpanam for the annual Vasanthotsavams of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, was performed on Wednesday evening in a traditional manner.
Rituals including Punyahavachanam, Raksha Bandhanam, Ankurarpanam and Senadhipathi Utsavam were held from 6 PM to 7:30 PM.
The Vasanthotsavams will be held from April 30 to May 2. Devotees can participate by paying Rs.150.
On May 1, Swarna Rathotsavam will be held at 9:30 AM. Snapana Tirumanjanam will be performed daily from 2:30 PM to 4:30 PM, followed by procession of the deity in the four mada streets from 7:30 PM to 8:30 PM.
Temple Deputy EO Sri Harindranath, Archaka Sri Babu Swami and others participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2026 ఏప్రిల్ 29: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగాఅంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.
మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకుస్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, అర్చకులు శ్రీ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది





