ANKURARPANAM HELD _ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
TIRUPATI, 16 JUNE 2024: The Ankurarpanam for the annual Brahmotsavam at Appalayagunta was held on a grand religious note on Sunday evening.
The annual fete will kick off with Dhwajarohanam on Monday in the auspicious Mithuna Lagnam between 6:55am and 7:25am.
AEO Sri Ramesh, temple inspector Sri Siva Kumar and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 జూన్ 16: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మేదినిపూజ చేపట్టారు. ఆ తరువాత సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ప్రతీతి. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణం నిర్వహించారు.
జూన్ 17న ధ్వజారోహణం :
జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 6.55 నుంచి 7.25 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.