ANKURARPANAM HELD _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ

Tirupati, 15 September 2024: For the annual Pavitrotsavams which are scheduled to commence from September 16, the festival of prelude, Beejavapanam was observed on Sunday evening in Sri Padmavati Ammavaru temple at Tiruchanoor.

Also known as Ankurarpanam, this ritual is being observed a day before the three-day annual event.

Temple DyEO Sri Govindarajan, AEO Sri Ramesh and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2024 సెప్టెంబ‌రు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌ రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ ర‌మేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ సుభాష్‌, శ్రీ గణేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది