‌ANKURARPANAM HELD _ శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUMALA, 18 NOVEMBER 2023: The Ankurarpanam for the annual Pushpayagam was held at Tirumala temple on Saturday night.

 

As a part of it, Senadhipathi Utsavam was held and Mritsangrahanam, Asthanam were performed at Vasanta Mandapam. Later Ankurarpanam was performed in Yagasala.

TTD has cancelled Sahasra Deepalankara Seva in connection with this ritual.

 

TTD EO Sri AV Dharma Reddy, one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Peishkar Sri Srihari were also present.

 

On Sunday Pushpayagam takes place between 1pm and 5pm.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమల, 2023 న‌వంబరు 18: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆదివారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.

సాయంత్రం శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. అనంతరం ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, పేష్కార్ శ్రీ శ్రీహరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌వంబ‌రు 19న పుష్ప‌యాగం

శ్రీ‌వారి ఆల‌యంలో ఆదివారం పుష్పయాగం సంద‌ర్భంగా రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.