ANKURARPANAM HELD FOR ANNUAL VASANTOTSAVAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupathi, 10 May 2025: The Ankurarpanam for the annual Vasantotsavam was performed on Saturday evening with religious fervor in Sri Padmavati Ammavaru temple at Tiruchanoor.

Traditional rituals, including Punyahavachanam, Rakshabandhanam, Ankurarpanam, and Senadhipati Utsavam were conducted.

The Vasantotsavam will be celebrated from May 11 to 13. Devotees can participate by paying Rs.150 per person.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2025 మే 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాస్కర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.