ANKURARPANAM HELD FOR SRI KT BTU _ శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 07 February 2026: The Ankurarpanam for the annual brahmotsavams at Sri Kapileswara Swamy temple was performed on Saturday evening.

As a part of the ritual of prelude, Sri Vinayaka took ride on Mooshika vahana.

On February 08, Dhwajarohanam will be performed at 6:05am in the auspicious Makara Lagnam.

Temple officials participated in this ritual.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

•  ఫిబ్రవరి 8  ధ్వజారోహణం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 07: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.

 ఫిబ్ర‌వ‌రి 8 ధ్వజారోహణం :

ఫిబ్ర‌వ‌రి 8న ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ ఫణి కుమార్ నాయుడు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేరి చేయబడింది.