ANKURARPANAM HELD FOR VONTIMITTA BRAHMOTSAVAMS _ శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Vontimitta /Tirumala, 05 April 2025: The annual Brahmotsavams in Vontimitta Sri Kodandarama temple commenced with a ritual of prelude, Ankurarpanam also known as Beejavapanam on Saturday evening.

The priests performed Vishwaksena Aradhana, Kalasa Pratista, Kalasa Puja, Vasudeva Punyahavachanam, Kankanadharana. Later, Mritsangrahanam (collecting holy soil) was performed.

DyEO Sri Natesh Babu, Temple Inspector Sri Naveen, Archakas and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
 
•⁠  ⁠ఏప్రిల్ 6న ధ్వజారోహణం
 
తిరుపతి, 2025 ఏప్రిల్ 05: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.
 
ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
 
 ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
ఏప్రిల్ 6న ధ్వజారోహణం
 
 ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.