ANKURARPANAM MARKS THE BEGINING OF BRAHMOTSAVAM OF SRI CHENNAKESAVA SWAMY AND SRI SIDDESWARA SWAMY _ శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
Tirupati / Tallapaka, July 24, 2026: The annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples at Tallapaka commenced with the traditional Ankurarpanam ceremony held on Friday evening as per Agama traditions.
The temple premises echoed with Vedic chants, mangala vadyams, special rituals and homams, creating a spiritually vibrant atmosphere.
At Sri Chennakesava Swamy Temple, Vishwaksena Aradhana, Punyahavachanam, Mrutsangrahanam, Kalasaradhana and Vastu Homam were performed before Ankurarpanam. The Brahmotsavams will formally begin with Dwajarohanam on July 25 between 10.30 am and 11.00 am.
Tallapaka, the birthplace of saint-poet Sri Tallapaka Annamacharya, holds a unique place in the spiritual and literary history of Telugu culture. Renowned for composing over 32,000 devotional hymns in praise of Lord Venkateswara, Annamacharya’s legacy continues to inspire devotees. Sri Chennakesava Swamy is revered as the presiding deity who blesses devotees with peace and prosperity.
At Sri Siddheswara Swamy Temple, Ganapati Puja, Punyahavachanam, Mrutsangrahanam, Kalasaradhana and Vastu Homam were performed before Ankurarpanam. The Brahmotsavams will commence with Dwajarohanam at 6.05 am on July 25.
According to the temple’s Sthala Puranam, Sri Siddheswara Swamy was consecrated by Lord Sri Rama during the Treta Yuga. As sages and siddhas worshipped the deity, the temple came to be known as Sri Siddheswara Swamy Temple. The ancient village, once called Tatipaka, later became Tallapaka, and continues to attract devotees with its rich spiritual and historical heritage.
TTD JEO Dr. A. Sharath, Temple Deputy EO Smt. A. Prasanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, temple priests, officials and devotees participated in the ceremony.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
తిరుపతి / తాళ్లపాక, 2026 జూలై 24: తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి ఉత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు.
వేదఘోషలు, మంగళవాద్యాలు, విశేష పూజలు, హోమాల నడుమ ఆలయ ప్రాంగణాలు భక్తి పారవశ్యంతో కళకళలాడాయి.
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో వైదిక వైభవం
సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, కలశారాధన, వాస్తుహోమం అనంతరం అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జూలై 25న ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి.
అన్నమయ్య జన్మభూమి తాళ్లపాకకు అపూర్వ ఆధ్యాత్మిక వైభవం
తెలుగు భక్తి సాహిత్యానికి చిరస్మరణీయ సేవలందించిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాకకు విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన అన్నమయ్య భక్తి వారసత్వానికి ఈ పుణ్యక్షేత్రం చిరస్థాయి చిహ్నంగా నిలిచింది. ఇక్కడ వెలసిన శ్రీ చెన్నకేశవస్వామివారిని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించిన వారికి సకల శుభాలు, సర్వాభీష్టాలు సిద్ధిస్తాయనే విశ్వాసంతో నిత్యం అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో అంకురార్పణ
సాయంత్రం 5 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, కలశారాధన, వాస్తుహోమం అనంతరం అంకురార్పణ నిర్వహించారు.
జూలై 25న ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
త్రేతాయుగ వైభవానికి సాక్ష్యంగా శ్రీ సిద్ధేశ్వర క్షేత్రం
తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడినదిగా స్థలపురాణం పేర్కొంటోంది. మునులు, సిద్ధులు ఈ స్వామివారిని ఆరాధించినందున “సిద్ధేశ్వరుడు” అనే నామం ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు “తాటిపాక”గా పేరొందిన ఈ ప్రాంతం కాలక్రమేణా “తాళ్లపాక”గా రూపాంతరం చెంది చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
