ANKURARPANAM PEFORMED FOR ASHTABANDHANA MAHASAMPROKSHANAM AT SRI VEDANARAYANA SWAMY TEMPLE _ శాస్త్రోక్తంగా శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ.
Tirupati, 17 February 2026: The Ankurarpanam for the Vimana Jeernoddharana Ashtabandhana Mahasamprokshanam at Sri Vedanarayana Swamy Temple, Nagalapuram was performed as per Agama traditions on Tuesday evening.
The Mahasamprokshanam rituals are scheduled to be held from February 17 to 22 at the temple of Sri Vedavalli Sameta Sri Vedanarayana Swamy in Nagalapuram. As part of the programme, Acharya Ritwik Varanam, Punyaham, Mrutsangrahanam and Ankurarpanam were conducted ceremoniously at 5.30 pm on Tuesday.
Programme Details :
February 18: Ashtabandhana Samarpana in the morning; in the evening, Punyaham, Panchagni Pratishtha, Kumbha Vahanam, Aradhana, Homam and Poornahuti.
February 19:
Panchagavyadhivasam and Nava Kalasa Snapanam.
February 20: Ksheerabdhi Vaasam in the morning; Vedic rituals in Yagasala in the evening.
February 21: Jaladhivasam in the morning; Maha Shanthi Tirumanjanam in the evening.
February 22: Vimana Rajagopura Samprokshanam from 11.00 am to 12.00 noon; Maha Samprokshanam of the Moolavarlu in the sanctum from 11.30 am to 12.30 pm. Later, darshan of the deity will be facilitated for devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ.
తిరుపతి, 2026, ఫిబ్రవరి 17: నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు జరుగనున్న విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం, పుణ్యహం మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 18న ఉదయం అష్ట బంధన సమర్పణ, సాయంత్రం పుణ్యాహం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభ వాహనం, ఆరాధన, హోమం, పూర్ణాహుతి, ఫిబ్రవరి 19న పంచ గవ్యాధివాసం, నవ కలశ స్నపనం చేపట్టనున్నారు.
ఫిబ్రవరి 20న ఉదయం క్షీరాబ్ధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఫిబ్రవరి 21న ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది.
ఫిబ్రవరి 22న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.





