ANKURARPANAM PERFORMED _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 27 NOVEMBER 2024: The Ankurarpanam was performed in Tiruchanoor on Wednesday evening.

As a part of this, Punyahavachanam, Raksha Bandhanam, Senapati Utsavam, were performed followed by Ankurarpanam in Yagasala.

JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, AEO Sri Devarajulu, Archakas and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2024 నవంబరు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.