ANKURARPANAM PERFORMED _ శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 01 July 2025: The rituals for Pushpayagam at Sri Govindaraja Swamy temple in Tirupati commenced with Ankurarpanam and Senadhipathi Utsavam on Tuesday evening at 5.30 pm. 

The procession of the divine commander-in-chief, Sri Vishwaksena was held around temple streets.

On Wednesday, July 02, Snapana Tirumanjanam will be performed at 9.30 am, followed by Pushpayagam from 1 pm to 4 pm with a range of variety of flowers to the deities.

Later, from 6 pm to 7.30 pm, Swamy along with Ammavarlu will bless devotees 

Deputy EO Smt. Shanti, AEO Sri Muni Krishna Reddy, temple officials and priests participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2025, జూలై 01: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 02వ తేదీ బుధవారం జ‌రుగ‌నున్న‌ పుష్పయాగానికి మంగళవారం  సాయంత్రం 5.30 – 8.30 గం.ల మధ్య సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్ర్తోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 – 7.30 గం.ల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు. 

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి,  ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.