ANKURARPANAM PERFORMED FOR ANNUAL BRAHMOTSAVAMS IN THALLAPAKA TEMPLES _ వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati, 05 July 2025: The annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy at Tallapaka in Annamayya district began on Saturday with Ankurarpanam.

For Sri Siddheswara Swamy, Dhwajarohanam will be held on July 6 at 6.16 AM, followed by daily vahana sevas including Hamsa, Chandra Prabha, Simha, Nandi, Gaja Vahanam, and Parveta Utsavam. Arjita Kalyanotsavam will be on July 11 and Pushpayagam on July 15.

For Sri Chennakesava Swamy, Dhwajarohanam is on July 6 between 9 to 10 AM in Simhalagna. Vahana sevas include Sesha, Hamsa, Simha, Hanumantha, Garuda, Gaja, Ashwa, and Rathotsavam. Arjita Kalyanotsavam will be on July 11, Chakrasnanam on July 14, and Pushpayagam on July 15.

TTD’s HDPP and Annamacharya Project will organize spiritual and cultural programs daily.

Officials and priests participated in the inaugural events.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2025, జూలై 05: టిటిడికి అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంకుర్పాణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం 05.00 గం.లకు, శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో సాయంత్రం 06.00 గం.లకు అంకురార్పణ జరిగింది.  

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వాహనసేవలు :

జూలై 06వ తేదీ ఉదయం 06.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.

జూలై 10న ఉదయం పల్లకీ సేవ, రాత్రి నంది వాహనం సేవ చేపడుతారు. జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 07.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. జూలై 12న సాయంత్రం పల్లకీ సేవ, జూలై 13న రాత్రి 6.00 గంటలకు పార్వేట ఉత్సవం, జూలై 14న ఉదయం 10.00 – 12.00 గంటలకు వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 05.00 – 06.00 గం.ల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 09.00 గం.లకు స్నపన తిరుమంజనం, రాత్రి 06.00 – 08.00 గం.ల మధ్య పుష్పయాగం చేపడుతారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :

జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 07న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 08న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 09న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 10న ఉదయం 09.00 గం.లకు మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ నిర్వహిస్తారు.

జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30  గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 12న సాయంత్రం 06.00 – 08.00 గం.ల మధ్య రథోత్సవం, జూలై 13న రాత్రి అశ్వవాహనం, జూలై 14న ఉదయం 09.30 – 10.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూలై 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ బాలాజీ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.