ANKURARPANAM PERFORMED FOR PATRA PUSHPA YAGAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, April 30, 2026: Ankurarpanam for the Patra Pushpa Yagam to be held on May 1 at Sri Kapileswara Swamy Temple, Tirupati, was performed on Thursday evening as per tradition.

Special rituals including Snapana Tirumanjanam will be held in the morning, followed by the Patra Pushpa Yagam with various sacred leaves and flowers. A procession will be taken out in the evening.

Devotees can participate in the ritual. The Yagam is performed as a ritual atonement during temple festivals.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2026 ఏప్రిల్ 30: తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 1వ తేదీ జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

మే 1న ఉదయం 7 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీ సోమ‌స్కంద‌మూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.