ANKURARPANAM PERFORMED IN SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAMS _ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, March 16, 2026: The Ankurarpanam ritual for the Sri Kodandarama Swamy Brahmotsavams in Tirupati was performed on Monday night as per traditional way .
Earlier in the morning, the Lord was awakened with Suprabhatam, followed by Thomala Seva and Sahasranamarchana. In the evening, Veda Parayanam and Prabandha Sattumora were conducted from 5:30 PM to 7:00 PM. Later, from 7:00 PM to 8:30 PM, Senadhipati Utsavam, Medini Puja, Mrutsangrahanam, and the Ankurarpanam ritual were performed in accordance with temple traditions.
Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Deputy EO Smt. Nagaratna, Temple Chief Priest Sri A.P. Anand Kumar Dikshitulu, Temple Inspector Sri Suresh, and other officials participated in the programme.
Dwajarohanam on March 17
The Brahmotsavams of Sri Kodandarama Swamy will commence grandly with Dwajarohanam on Tuesday between 8:00 AM and 9:00 AM in Mesha Lagnam.
As part of this, Sri Kodandarama Swamy along with Sita and Lakshmana, along with Dhvajapatam and Chakrathalwar, will take part in the Tiruveedhi Utsavam from 6:30 AM to 8:00 AM.
Later, the Dwajarohanam ceremony will be performed in the presence of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2026 మార్చి 16: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 17న ధ్వజారోహణం :
మంగళవారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






