ANNABHISHEKAM HELD AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

Tirupati, 15 November 2024: Annaabhishekam, offering a special bath with cooked rice was held in a grand style at Sri Kapileswara Swamy Temple in Tirupati on Friday in connection with the auspicious Karthika Pournami. 

On this occasion, Annabhishekam and Deeparadhana were performed in Ekantam from 12 noon to 4 pm. 

Later, devotees were allowed to have darshan of Annalingam from 4 pm to 6 pm. 

After that Annalinga Udhwasana was performed and the devotees were allowed for darshan.

The temple Deputy EO Sri Devendra Babu, other officials, temple priests and a large number of devotees participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

తిరుపతి, 2024 నవంబరు 15: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పుర‌స్క‌రించుకుని శుక్రవారం అన్నాభిషేకం ఘనంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వహించారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు.

తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన, శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.