ANNABHISHEKAM IN KT _ నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
TIRUPATI, 03 NOVEMBER 2024: Annabhishekam will be observed by TTD in Sri Kapileswara Swamy temple in Tirupati on November 05.
This unique Abhishekam will take place from 12noon to 4pm in Ekantam followed by Darshan to devotees between 4pm and 6pm.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి, 2025 నవంబరు 03: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
