ANNAMACHARYA TOOK THE 32 BEEJAKSHARA MANTRA DEEKSHA FROM AHOBILAM _ అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు

TIRUMALA REVERBERATES TO THE MELODIES OF ANNAMACHARYA KRITIS

 

519TH VARDHANTI OF SAINT POET OBSERVED WITH RELIGIOUS FERVOUR

 

TIRUMALA, 29 MARCH 2022: The hill town of Tirumala reverberated to the melodious rendering of Annamacharya kritis on the occasion of the 519th vardhanthi of the Saint poet on Tuesday evening.

 

The artists of the Annamacharya Project presented the seven precious gems out of 32000 incredible Sankeertans penned by Sri Tallapaka Annamacharya during his 95-years life span.

 

During his Anugraha Bhashanam on the occasion, the Pontiff of Ahobila mutt Sri the 46th Jeeyar Srivan Satakopa Sri Ranganatha Yateendra Mahadesikan Swamiji said Sri Annamacharya took the Deeksha of 32 Beejakshara Mantra from Ahobilam and penned 32000 Sankeertans. He lauded TTD for organising the Annamacharya Vardhanti in a big manner every year.

 

Later the successors of the Annamacharya dynasty were felicitated on the occasion.

 

JEO TTD Sri Veerabrahmam, Program Officer Sri Vijayasaradhi, Annamacharya Project Director Dr Akella Vibhishana Sharma, DyEO FMS Sri Rama Rao, SV College of Music and Dance Principal Sri Sudhakar, Temple Peishkar Sri Srihari and other officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

తిరుమల, 2022 మార్చి 29: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో స‌ప్త‌గిరులు పులకించాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. 32 వేల సంకీర్తనలకు గుర్తుగా 32 మంది సంగీత విద్వాంసులతో అన్నమయ్య సంకీర్తనలు వినాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామిజీని జెఈఓ శ్రీ వీరబ్రహ్మం శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం అహోబిల మఠం తరఫున శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి వస్త్రం సమర్పించారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీషణ శ‌ర్మ మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి మహోత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరుప‌తి, తాళ్ళ‌పాకలో కూడా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. రాబోవు రోజులలో అన్నమయ్య వర్ధంతి, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ముందుగా నిర్వహించిన దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…., ” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు. వీరిలో టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదనరావు, శ్రీ బి.ర‌ఘునాథ్‌, శ్రీ‌మ‌తి బుల్లెమ్మ‌తో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రంగ‌నాథ్‌, డా.కె. వందన, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు ఉన్నారు.

చివరగా టిటిడి తరఫున తాళ్లపాక వంశీయులను జెఈఓ సత్కరించారు. వీరిలో శ్రీ తాళ్లపాక కె.రాఘవన్, శ్రీ తాళ్లపాక విజయరాఘవాచార్యులు, శ్రీ తాళ్లపాక వేంకటనాగభూషణం, శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు, శ్రీ తాళ్లపాక శేషధర రవికుమార్, శ్రీ తాళ్లపాక రాఘవ అన్నమయ్య ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, డెప్యూటీ ఈఓ శ్రీ రామారావు, ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.